2026 Kawasaki Versys X-300: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki), తన అడ్వెంచర్-టూరర్ శ్రేణిలో భాగమైన 2026 వెర్సస్ X-300 (Versys X-300) బైక్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరను ఎక్స్-షోరూమ్ లో రూ.3.49 లక్షలుగా నిర్ణయించారు. ఇదివరకు వెర్షన్‌తో పోలిస్తే మెకానికల్ మార్పులు పెద్దగా లేవు. అయితే 2026 ఎడిషన్ కొత్త గ్రాఫిక్స్, ఆకర్షణీయమైన రంగులతో కొత్త లుక్‌లోకి వచ్చింది. కొత్త వెర్సస్ X-300 బైక్ ఇప్పుడు ‘కాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్’ అనే డ్యుయల్-టోన్ కలర్ స్కీమ్‌లో లభిస్తోంది. బైక్ డిజైన్‌లో పొడవైన విండ్‌స్క్రీన్, లగేజ్ ర్యాక్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కొనసాగించారు. ఈ మార్పులు బైక్‌ను మరింత ప్రీమియం లుక్‌లోకి తీసుకువచ్చాయి.
Amazon Layoffs: టెక్ట్స్ మేసేజ్‌లతో ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెజాన్..
ఇంజిన్ పరంగా.. కొత్త వెర్సస్ X-300 తన పాత ఇంజిన్ ను కొనసాగించింది. అదే 296cc, లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్, ఇది నింజా 300 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ ఇంజిన్ 40 PS పవర్, 25.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఫీచర్లతో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఈ ఇంజిన్ తాజా OBD-2B ఉద్గార ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉంది. ఇక సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థల పరంగా కూడా ఈ బైక్ సాహస యాత్రలకు అనువుగా రూపొందించబడింది. హై-టెన్సైల్ స్టీల్ బ్యాక్‌బోన్ ఫ్రేమ్, ముందు భాగంలో 41 mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో 148 mm ట్రావెల్ సామర్థ్యంతో మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు 290mm సింగిల్ డిస్క్, వెనుక 220mm డిస్క్ బ్రేక్, అలాగే డ్యూయల్-ఛానల్ ABS భద్రతా సదుపాయం అందుబాటులో ఉంది.
IND vs AUS: భారత బౌలర్లపై విరుచుకుపడ్డ ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
వెర్సస్ X-300 బైక్‌లో 19-అంగుళాల ముందు, 17-అంగుళాల వెనుక స్పోక్డ్ వీల్స్ ఉన్న ట్యూబ్డ్ టైర్లు అందుబాటులో ఉన్నాయి. బైక్ యొక్క ఇతర ముఖ్య కొలతల్లో 180mm గ్రౌండ్ క్లియరెన్స్, 815mm సీటు ఎత్తు, 17 లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉన్నాయి. దీని వల్ల దీర్ఘ సాహస యాత్రలకు ఈ బైక్ మరింత అనుకూలంగా మారింది. మొత్తంగా 2026 వెర్సస్ X-300 పాత మోడల్‌లోని విశ్వసనీయత, పనితీరును కొనసాగిస్తూ కొత్త గ్రాఫిక్స్ మరియు ఫ్రెష్ కలర్ ఆప్షన్‌తో విడుదలైంది. అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో మధ్యస్థ బడ్జెట్ రైడర్లకు ఇది కవాసకి తరఫున మరో అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది.