Site icon NTV Telugu

ఆధునిక ఫీచర్లు, ఫ్యూయెల్ ఎఫీషియన్సీతో 2026 Kawasaki Versys 1100 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ లాంచ్..!

2026 Kawasaki Versys 1100

2026 Kawasaki Versys 1100

2026 Kawasaki Versys 1100: కవాసాకి 2026 వెర్షన్ Versys 1100 మోటార్ సైకిల్‌ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 2025లో Versys 1000 ను రీప్లేస్ చేస్తూ భారత్‌లో డెబ్యూ చేసిన Versys 1100 ఇప్పుడు మరింత రిఫైండ్ పవర్ యూనిట్‌తో అందుబాటులోకి వచ్చింది. డిజైన్, ఫీచర్లు ఇలా అన్నిటిలో 2026 మోడల్ మరింత మెరుగుదల చూపిస్తుంది. 2026 Kawasaki Versys 1100లో 1,099 cc లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్ ఉంది. దీన్ని 6-స్పీడ్ గియర్‌బాక్స్, రిటర్న్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్‌తో జతచేశారు. ఈ పవర్ యూనిట్ 133 hp పీక్ పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది గత మోడల్ కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది.

స్టైలింగ్, పర్ఫామెన్స్, సౌకర్యం కలయికతో Toyoto Urban Cruiser Hyryder Aero Edition లాంచ్..!

ఈ శక్తివంతమైన ఇంజిన్ రైడింగ్‌ను మరింత రైడింగ్ ఫీల్ ను అందిస్తుంది. Versys 1100 మంచి పనితీరు మాత్రమే కాదు.. కవాసాకి దీని ECUని ఆప్టిమైజ్ చేసి మంచి ఫ్యూయెల్ ఎఫీషియన్సీను అందిస్తుంది. 21 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ తో, సుదూరాల రైడింగ్ కోసం తక్కువ ఇంధన స్టాప్‌ లతో అనుకూలంగా ఉంటుంది. ఈ పవర్, ఎకనమీ సమతుల్యం Versys 1100ని ప్రతి రైడింగ్ నుంచి అడ్వెంచర్ టూరింగ్ వరకు విస్తృత ఉపయోగానికి అనుకూలంగా చేస్తుంది.

Lakshmi Puja: దీపావళి రోజు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంత..!

2026 Kawasaki Versys 1100లో ఆధునిక సేఫ్టీ, రైడింగ్ ఫీచర్లతో రైడింగ్ అనుభవాన్ని మరింత పెంపొందించడంపై దృష్టి పెట్టారు. ఇందులో కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ (KTRC), కవాసాకి కార్నేరింగ్ మానేజ్మెంట్ ఫంక్షన్ (KCMF), కవాసాకి ఇంటెలిజెంట్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టం (KIBS) వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లు రైడర్లకు అదనపు సేఫ్టీ, కన్ట్రోల్ అందిస్తాయి. ఈ అడ్వెంచర్ టూరర్ ధర రూ.13.79 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణించారు. మొత్తంగా 2026 Versys 1100 శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ఫ్యూయెల్ ఎఫీషియన్సీతో భారత అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మార్కెట్లో మంచి ఎంపికగా నిలుస్తుంది.

Exit mobile version