2024 Maruti Suzuki Swift: ఇండియాలో హ్యాచ్‌బ్యాక్ కార్లలో నెంబర్ 1గా ఉన్న మారుతి సుజుకీ స్విఫ్ట్ న్యూ అవతార్‌లో రాబోతోంది. గతంతో పోలిస్తే పూర్తిగా టెక్ లోడెడ్ ఫీచర్లతో ఎంట్రీ ఇవ్వనుంది. 2023 జపాన్ మొబిలిటీ షోలో తొలిసారిగా ఈ కారును ప్రదర్శించారు. ఫోర్త్ జనరేషన్ న్యూ స్విఫ్ట్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్‌లో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా రాబోతున్న స్విఫ్ట్‌లో గ్రిల్, హెడ్ లైట్స్ రీ డిజైన్ చేయబడ్డాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్, ఫాగ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటివి కొత్త కారులో చూడొచ్చు.
Read Also: Zomato: జొమాటోకు జీఎస్టీ భారీ షాక్.. నోటీసులో ఏముందంటే..!
ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, టెయిల్ గేట్, ORVMలకు కెమెరాలు ఉండటంతో పాటు 360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉండనుంది. మారుతి సుజుకీ బాలెనో ఉన్నట్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమెట్ కంట్రోల్ యూనిట్స్ కొత్త స్విఫ్ట్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే, జపాన్‌లో ప్రదర్శించి స్విఫ్ట్‌లో ADAS మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఇండియాలో లాంచ్ అయ్యే కార్లలో ఈ రెండు ఫీచర్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. వీటి ద్వారా కార్ ధర మరింత పెరగే అవకాశం ఉండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం, స్విఫ్ట్ 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT ఇంజిన్‌ను ఉపయోగిస్తోంది, ఇది 90PS మరియు 113Nm శక్తిని అందిస్తుంది. ఇంజిన్‌ను 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTతో రావచ్చు. సీఎన్‌జీ ఆప్షన్ కూడా కొత్త స్విఫ్ట్‌లో ఉండనుంది. ఈ కారు పెట్రోల్ MTకి 22.38kmpl, పెట్రోల్ AMTకి 22.56kmpl మరియు CNGకి కేజీకి 30.90km మైలేజీని ఇవ్వనుంది. స్విఫ్ట్ ధర ప్రస్తుతం రూ. 5.99 లక్షల నుండి రూ. 9.03 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ ధర ప్రస్తుత మోడల్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది.