NTV Telugu Site icon

Kia Seltos facelift: కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. క్రెటాకు తిప్పలు తప్పవా.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే..?

Kia Seltos 2023

Kia Seltos 2023

Kia Seltos facelift: సౌత్ కొరియన్ ఆటో మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ను ఈ రోజు ఆవిష్కరించింది. కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఈ నెల 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపింది. కొత్త సెల్టోస్ 18 వేరియంట్లతో అందుబాటులో ఉండనుంది. కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటాకు డైరెక్ట్ కాంపిటీషన్ కాబోతోంది. గత సెల్టోస్ తో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఇంటీరియర్, ఎక్స్ టీరియర్లోలో భారీ మార్పులు చేసింది. మిడ్-సైజ్ SUV విభాగంలో ఉన్న అన్ని కార్లకు పోటీ ఇవ్వనుంది. 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 11 లక్షల నుండి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చని అంచనా.

ఫీచర్లు ఇవే:

కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కియా సిగ్నేచర్ స్టార్ మ్యాప్ LED లైటింగ్ కాన్సెప్ట్‌తో ‘ఆపోజిట్స్ యునైటెడ్’ డిజైన్ తో రాబోతోంది. కొత్త క్రౌన్ జ్యువెల్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఐస్-క్యూబ్ LED ఫాగ్ ల్యాంప్స్, సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్‌లు, రీడిజైన్ చేయబడిన LED లైట్ గైడ్ మరియు LED DRLలు ఉన్నాయి. బంపర్ రీడిజైన్, కొత్త స్కిడ్ ప్లేట్, పెద్ద టైగర్ నోస్ గ్రిల్ ఉన్నాయి. గత సెల్టోస్ తో పోలిస్తే మొత్తం పొడవు 50 మిమీ పెరిగింది.

2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెనుక భాగంలో, మీరు రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, కొత్త స్టార్ మ్యాప్ LED కనెక్ట్ చేయబడిన టెయిల్‌ల్యాంప్‌లు ఇచ్చారు. 18-అంగుళాల క్రిస్టల్ కట్ గ్లోసీ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో రాబోతోంది. కొత్త సెల్టోస్ మొత్తం 8 మోనో టోన్ కలర్స్ తో పాటు 2 డ్యుయల్ టోన్ రంగుల్లో రాబోతొంది.
ప్యూటర్ ఆలివ్ (కొత్త), ఇంపీరియల్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్, మెరిసే సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ (ఎక్స్-లైన్), గ్లేసియర్ వైట్ పెర్ల్ విత్ అరోరా బ్లాక్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్‌-రెడ్ కాంబినేషన్ కలర్స్ తో రానుంది.

గతంలో కన్నా ప్రీమియం:

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ గతంలో కన్నా ప్రీమియంగా రాబోతోంది. గతంలో ఉన్న పనోరమిక్ సన్ రూఫ్, ఎలక్ట్రిక సన్ రూఫ్ గా మారింది. డ్యూయల్-జోన్ పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ ఉండనుంది. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ 10.25-అంగుళాల డిస్‌ప్లేతో సరికొత్త లుక్ ఇవ్వబోతోంది. 10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ స్పీకర్లతో సౌండ్ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్, 360 డిగ్రీ కెమెరా, 67 ఫీచర్లలో కెనెక్టివిటీ టెక్నాలజీ ఉంది. కెమెరా, రెండు రాడార్లలో లెవల్ 2 ADAS ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 32 సెక్యురిటీ ఫీచర్లు ఉన్నాయి.

3 ఇంజన్లు.. 5 ట్రాన్స్‌మిషన్ ఛాయిస్:

కొత్త సెల్టోస్ మొత్తం 3 ఇంజన్ ఆఫ్షన్లతో వస్తోంది. స్మార్ట్‌స్ట్రీమ్ 1.5-లీటర్ Turbo-GDi పెట్రోల్ ఇంజన్ 160 పీఎస్ పవర్ 253 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ iMT లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్‌తో కలిగి ఉండవచ్చు. స్మార్ట్‌స్ట్రీమ్ 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 115 పీఎస్ పరవ్, 144 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ MT లేదా IVT ఆటోమేటిక్‌తో ఉంటుంది. స్మార్ట్‌స్ట్రీమ్ 1.5-లీటర్ CRDi VGT డీజిల్ ఇంజన్ (116PS/250Nm) 6-స్పీడ్ iMT లేదా 6-స్పీడ్ ATతో కలిగి ఉండవచ్చు.

కియా సెల్టోస్ 2023 హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్ , ఎంజీ ఆస్టర్ కు పోటీగా ఉండనుంది.