NTV Telugu Site icon

Huge Discount on SUV: ఈ ఎస్‌యూవీ కారుపై భారీగా డిస్కౌంట్.. ఏకంగా రూ.12 లక్షల తగ్గింపు

Jeep

Jeep

అక్టోబర్ 31 ముగింపుతో అనేక కార్లపై పండుగ ఆఫర్లు కూడా ముగిశాయి. అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ మోడల్స్‌పై భారీ తగ్గింపులను అందజేస్తున్నాయి. ఇందులో జీప్ గ్రాండ్ చెరోకీ ఒకటి. ఈ ఎస్‌యూవీ పై కంపెనీ 12 లక్షల రూపాయల తగ్గింపును ఇస్తోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క ఒక పరిమిత వేరియంట్‌ను మాత్రమే విక్రయిస్తుంది. రూ.12 లక్షల నగదు తగ్గింపు తర్వాత, దాని కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.50 లక్షలుగా మారింది. మీరు ఈ ప్రీమియం, లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే, ఇది ఉత్తమ అవకాశం.

జీప్ గ్రాండ్ చెరోకీ ఇంజిన్..
జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీ 2.0-లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‍ను కలిగి ఉంది. 268 bhp గరిష్ట పవర్ , 400 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేయగలదు. 8-స్పీడ్ టార్క్యూ కన్వర్టర్ ఉంటుంది. క్వాడ్రాటాక్ (Quadratac) 4×4 సిస్టమ్ ద్వారా నాలుగు వీల్‍లకు పవర్ చేరుతుంది. ఏడు స్లాట్ల ఫ్రంట్ గ్రిల్, క్లామ్‍షెల్ బొనెట్, బాక్సీ సిల్హొయెట్‍తో జీప్ గ్రాండ్ చెరోకీ.. డిజైన్‍పరంగా ఆకర్షణీయంగా ఉంది. జీప్‍ లుక్‍ను ఇస్తుంది. 20 ఇంచుల అలాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది.

ఈ కారు ఫీచర్లు..
యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సపోర్టుతో కూడిన 10.2 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍ను ఈ జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీ కలిగి ఉంది. డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ కన్సోల్, పనోరామిక్ సన్‍‍రూఫ్‍తో వస్తోంది. ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేకమైన డిస్‍ప్లే ఉంటుంది. కాప్రి లెదర్‍తో సీట్లు ఉంటాయి. వెంటిలెటెట్ ఫ్రంట్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, వాయిస్ కమాండ్, 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, హెడ్ అప్ డిస్‍ప్లే యూనిట్‍ను గ్రాండ్ చెరోకీ కారు కలిగి ఉంది. ఎనిమిది ఎయర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, టీసీఎస్, ఈఎస్‍సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, టీపీఎంఎస్, ఏడీఏఎస్ సెఫ్టీ ఫీచర్లను Jeep Grand Cherokee SUV కలిగి ఉంది. ఫైవ్ సీటర్‌గా ఇది అందుబాటులో ఉంది. జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీకి ఆడి క్యూ7, మెర్సెడెస్ బెంజ్ జీఎల్ఈ, వోల్వో ఎక్స్‌సీ90, బీఎండబ్ల్యూ ఎక్స్5 పోటీగా ఉన్నాయి.

Show comments