ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైసీపీ ముందునుంచీ బలహీనవర్గాలకు పెద్ద పీట వేస్తుందని జగన్ నిరూపిస్తున్నారు.
బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారు. ఈ స్థాయిలో బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.