NTV Telugu Site icon

వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీకి సిద్ధమైన సీఎం జగన్..

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్… రేపు వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది… రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జరుగుతోన్న ఈ భేటీలో.. పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీ సీఎం.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు, పెండింగ్‌ ప్రాజెక్టులు.. విభజన చట్టంలో అమలుకు నోచుకోని అంశాలు సహా వివిధ అంశాలతో ఈ సమావేశాల్లో వైసీపీ లేవనెత్తే అవకాశం ఉంది.