NTV Telugu Site icon

అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన విచారణ

నేడు మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు విచారించనున్నారు. నిన్న ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ కోసం తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణంరాజును అధికారులు ఆరా తీశారు. విచారణలో కొన్ని కీలక అంశాలను సీఐడీ అధికారులు రాబట్టారు. రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు రికార్డు చేశారు.