ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ ఇక్బాల్. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదన్నారు. గతంలో ఇచ్చిన డాక్టర్ సర్టిఫికెట్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం, ఎమ్మెల్యేగా ఉండడంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు ఇక్బాల్. దీంతో ఈవ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాట్లాడే హక్కు చంద్రబాబు , బాలకృష్ణ కు లేదన్నారు ఎమ్మెల్సీ ఇక్బాల్.
Read Also: NTR: ఎన్టీఆర్ గురించి నీచంగా మాట్లాడితే.. చంద్రబాబు నీచ చరిత్ర ప్రజలకు చూపిస్తాం
మానసిక క్షోభతో ఎన్టీఆర్ అకాల మరణం చెందడంపై ఛార్జిషీటు ఫైల్ చేస్తే బావ బామ్మర్దుల పేర్లు ఉంటాయన్నారు. ఓ సినీ నిర్మాతను రివాల్వర్ తో కాల్చిన కేసులో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి పుణ్యం తోనే బాలకృష్ణ కేసు నుంచి బయటపడ్డారన్నారు. బాలకృష్ణ సినిమాలు, రాజకీయాల్లో ఉన్నాడంటే అది ఆనాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అన్నారు ఇక్బాల్. ఎమ్మెల్యే మతిస్థిమితం కోల్పోయినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని వెల్లడించారు. ఇక్బాల్ కామెంట్లపై టీడీపీ నేతలు ఏమంటారో చూడాలి.
Read Also: MP K Laxman : రజాకార్ల పాలనను తలదన్నే రీతిలో కేసీఆర్ పాలన