Kethireddy Pedda Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ బ్రదర్స్ మధ్య.. సవాళ్లు, ప్రతిసవాళ్లు, వార్నింగ్‌లు, ఆరోపణలు, విమర్శలు.. నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి బ్రదర్స్.. కేతిరెడడ్ఇ పెద్దారెడ్డి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండేలా వీరి వ్యవహార శైలి ఉంటుంది.. తాజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను రాజకీయాలైనా… ఫ్యాక్షన్ అయినా జేసీ కుటుంబంతో చేస్తానని ధైర్యంగా చెబుతున్నానంటూ ప్రకటించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ కుటుంబం జూటూరు చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న పేదల భూములను దౌర్జన్యంగా తక్కువ డబ్బులకే లాక్కున్నారని ఆరోపణలు గుప్పించారు.. గద్వాల్ నుండి జుటూరుకు వచ్చి గ్రామాలలో కక్షలు పెట్టి.. అంచెల అంచెలుగా ఎదిగారని విమర్శించారు.
Read Also: Internet Shutdowns: మరోసారి టాప్‌లో భారత్.. వరుసగా ఐదోసారి..!
గత 30 సంవత్సరాల నుండి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ ఫ్యాక్షన్ ను ప్రోత్సహించారని ఆరోపించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ బ్రదర్స్ అధికారంలో ఉండగా నా సొంత ఊరు తిమ్మంపల్లికి వందలాది మంది పోలీసులతో.. వేల మంది అనుచరులతో వచ్చారని తెలిపారు.. అయితే, తాను మాత్రం అలా కాదు.. నేను తాడిపత్రి ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క వాహనంలో వచ్చి జూటూరు గ్రామంలో కొందరిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపించుకున్నానని గుర్తుచేసుకున్నారు.. అందుకే.. నేను రాజకీయాలైనా.. ఫ్యాక్షన్ అయినా.. జేసీ కుటుంబంతో చేస్తాను.. ఈ విషయాన్ని ధైర్యంగా చెబుతున్నానంటూ ప్రకటిస్తూ సవాల్ విసిరారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.