NTV Telugu Site icon

Chennakesava Reddy: వీఆర్‌వోలను తొలగిస్తే గ్రామలకు పట్టిన పీడ పోతుంది.. వారిని అటెండర్లుగా పంపాలి..!

Chennakesava Reddy

Chennakesava Reddy

Chennakesava Reddy: మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి.. గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన ఆయన.. ఈ సారి ప్రభుత్వ ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఉన్న వీఆర్‌వో, వీఏవోలను తొలగిస్తే గ్రామలకు పట్టిన పీడ పోతోందంటూ సంచలన కామెంట్లు చేశారు.. గ్రామ, వార్డు సచివాలయలలో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ ఆయన.. రెవెన్యూలో ఉన్న వీఆర్వో, వీఏవోలను అటెండర్లుగా పంపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ప్రకటించారు చెన్నకేశవరెడ్డి..

Read Also: Viral Video: రెప్పపాటులో గుండెపోటుతో కుప్పకూలాడు.. సీపీఆర్ చేసి నిమిషాల్లో.. వీడియో వైరల్

గతంలోనూ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి.. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి.. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు… బీజేపీ అధికారం లేని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక తాటి పైకి వచ్చి.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్ కేశవరెడ్డి.. ఇక, గతంలో గోవ నిషేధ చట్టంపై హాట్‌ కామెంట్లు చేశారు చెన్నకేశవరెడ్డి.. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేసిన ఆయన.. ఇది కాలం చెల్లిన పాత చట్టాల్లో ఒకటని.. ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆర్​ఎస్ఎస్ దాని అనుబంధ సంస్ధలు మతసామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి చట్టం లేదన్నారు. హిందువులకు గోవు పూజ్యనీయమైనదని.. కానీ, ముస్లింలకు ఆహార పదార్థం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.. ఇలా, పలు సందర్భాల్లో ఆయన వార్తలు నిలిచారు.