Site icon NTV Telugu

Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు..

Bothsa

Bothsa

వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజధానిపై చర్చనీయాంశంగా మారాయి. బొత్స మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితి, ప్రభుత్వ స్టాండ్ ప్రకారం 3 రాజధానులు అని అన్నామని బొత్స తెలిపారు. ఇప్పుడు రాజధానిపై తమ విధానం ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు అంత ఖర్చుపెట్టే స్థోమత లేదని అన్నారు. అందుకే అమరావతి స్మశానంలా ఉందని అన్నాం.. ఇందులో ఎలాంటి వివాదం లేదని బొత్స స్పష్టం చేశారు.

Also Read:Viral Video: ఎవడ్రా నువ్వు.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు.. ఏకంగా కరెంట్ తీగల మీదే మొదలు పెట్టేశావ్

కాగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది ఏపీకి మూడు రాజధానుల అంశం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలని ప్రభుత్వం భావించింది. కానీ అది సాధ్యపడలేదు. ఎన్నికల ముందు మూడు రాజధానులే మా విధానం అని చెప్పిన వైసీపీ నేతలు వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version