Site icon NTV Telugu

Andhra Pradesh: రేపు తాడేపల్లిలో బీసీ మంత్రులు, నేతల కీలక సమావేశం

Bc Leaders Meeting

Bc Leaders Meeting

Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం కానున్నారు. ఈ భేటీకి మొత్తం 9 మంది నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 9 మందిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముత్యాలనాయుడుతో పాటు ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరుకానున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించారనే విషయాన్ని ప్రజలకు ఎలా వివరించాలనే అంశంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

Read Also: MInister Peddireddy: భూ సర్వేతో ఏపీని జగన్‌ తొలి స్థానంలో నిలిపారు.. ఇక, చంద్రబాబు సీఎం కాలేరు..!

అటు 2024లో జరిగే ఎన్నికల్లో బీసీ వర్గాలను కన్సాలిడేట్ చేసుకోవటం, ఈ వర్గాలకు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం, రాష్ట్ర స్థాయి సదస్సులు వంటి అంశాలపై బీసీ నేతలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశం అనంతరం బీసీ నేతలందరూ ముఖ్యమంత్రి జగన్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్ హాజరయ్యారు.

Exit mobile version