ఎంపీ గోరంట్ల మాధవ్ పక్కన ఫోటో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని అనితారెడ్డి ఆరోపించారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో తన ఫోటోను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త అనితా రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆయన పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు.నాలుగేళ్లుగా వైసీపీ సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని.. అప్పటినుంచి టీడీపీకి చెందిన వారు తనను టార్గెట్ చేశారని చెబుతున్నారు అనితారెడ్డి.