NTV Telugu Site icon

YSR Pension: జూన్ 1న వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం

Ysr Pension Kanuka

Ysr Pension Kanuka

YSR Pension Kanuka Distribution Starts From June 1st: జూన్ 1వ తేదీన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. ఈ కానుక కింద 63.14 లక్షల మంది లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మే నెల పెన్షన్ మొత్తాలను జూన్ 1న నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న సీఎం జగన్ సంకల్పంలో భాగంగా.. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. గురువారం (జూన్ 1న) తెల్లవారుజాము నుంచి వాలంటీర్లు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ. 1739.75 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశామని.. సచివాలయాల ద్వారా వాలంటీర్లు పెన్షనర్లకు నేరుగా చేతికే అందచేస్తారని అన్నారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.

Kiran Kumar Reddy: కిరణ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. సందర్భం వచ్చాక స్పందిస్తా

అయితే.. లబ్దిదారులకు పెన్షన్ అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్, ముఖ ప్రమాణీకరణ విధానాలను అమలు చేస్తున్నామని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. అలాగే ఆర్‌బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా ఉండేలా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ మొత్తాలను ఐదు రోజుల్లో 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా వాలంటీర్లను ఆదేశించామన్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్‌డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని చెప్పుకొచ్చారు.

Nellore Crime: నెల్లూరులో విషాదం.. పిల్లల్ని రక్షించబోయి తల్లులు మృతి

Show comments