వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ సరిహద్దులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీ భద్రత నడుమ కడప పీఎస్‌కు తరలించినట్లు సమాచారం. గత నాలుగు రోజుల క్రితం వర్రా రవీంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు.. 41ఏ నోటీసులు జారీ చేసి తాలుకా పోలీసులు వదిలి వేశారు. అన్నమయ్య జిల్లా పోలీసులు మరో కేసులో వర్ర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు కళ్ళుగప్పి పరారయ్యాడు. ఈ ఘటనలో కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు చిన్నచౌక్ సీఐ తేజోమూర్తిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Read Also: Fake currency: యూట్యూబ్ సాయం.. రూ. 500 నకిలీ నోట్ల ప్రింటింగ్..
గత నాలుగు రోజులుగా కడప, అన్నమయ్య జిల్లా పోలీసులు వర్రా రవీంద్రారెడ్డి కోసం 4 బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మహబూబ్ నగర్ సరిహద్దులో వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు కావడంతో జిల్లా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో వర్రా రవీంద్రారెడ్డి పై కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Gwalior: గ్వాలియర్‌లో కాల్పులు.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వ్యక్తి హత్య