NTV Telugu Site icon

YS Jagan: ప్రేమోన్మాది చేతిలో బాలిక హత్య.. కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్..

Badvel Inter Girl Incident

Badvel Inter Girl Incident

YS Jagan: బద్వేల్ పట్టణంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రేపు కడప జిల్లాలో పర్యటించనున్న వైఎస్‌ జగన్‌.. బద్వేల్ పట్టణంలో హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి.. ధైర్యాన్ని చెప్పనున్నారు.. బద్వేల్ పట్టణంలోని రామాంజనేయనగర్ లో ఉన్న బాధిత బాలిక కుటుంబ సభ్యులను కలిసి.. వారిని ఓదార్చ నున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బద్వేల్ చేరుకోనున్న జగన్‌.. బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన పులివెందులకు చేరుకుని రాత్రికి పులివెందులలో బస చేయనున్నారు.

Read Also: MechanicRocky : మొన్న చూసుకున్న చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను : విశ్వక్ సేన్

కాగా, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ఇంటర్ విద్యార్ధిని.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన విషయం విదితమే.. ఇక, ఈ ఘటనకు కారకుడిగా భావిస్తోన్న ప్రేమోన్మాది విఘ్నేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న విఘ్నేష్‌కు.. ఇంటర్‌ విద్యార్ధినితో చిన్న నాటి నుంచి పరిచయం ఉండగా.. అతడికి ఇప్పటికే పెళ్లి అయ్యింది.. అయితే, శనివారం ఆమెకి ఫోన్ చేసి తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.. దీంతో, కాలేజీ నుంచి బాలిక ఆటోలో బయల్దేరగా.. ఆ తర్వాత విఘ్నేష్‌ కూడా మధ్యలో అదే ఆటో ఎక్కాడు.. బద్వేల్‌కు దాదాపు 10 కిలో మీటర్ల దూరంలోని పీపీకుంట చెక్‌పోస్టు వద్ద దిగి ఆటో దిగి.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు.. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో ఏమో.. కానీ.. కొంతసేపటికి ఆ బాలికపై విఘ్నేష్‌ పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు.. ఆ బాలిక కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం.. వారు బాలికను ఆస్పత్రికి తరలించడం.. ఆ తర్వాత ఆ బాలిక మృతిచెందిన విషయం విదితమే..

Show comments