Site icon NTV Telugu

YS Jagan: నేడు పులివెందులలో వైఎస్ జగన్.. ప్రజలతో ముఖాముఖి..!

Jagan

Jagan

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ( ఆదివారం ) పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివేందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. నిన్న మధ్యాహ్నం కడపకు చేరుకున్న వైఎస్ జగన్ కు వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రిమ్స్ కు వెళ్లి టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వేంపల్లె గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తను జగన్ పరామర్శించారు.

Read Also: Gujarat : సూరత్‎లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

ఇక, నేడు పులివెందులలో వైఎస్ జగన్ ప్రజలతో ముఖాముఖి భేటీ కానున్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ప్రజల దగ్గర నుంచి వైఎస్ జగన్ నేరుగా వినతులను స్వీకరించనున్నారు. కాగా, జగన్ పులివెందులలో ఉంటారని తెలిసి ఇతర జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి భారీగా తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. రేపు ఇడుపుల పాయలో దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనాల్లో పాల్గొననున్నారు.

Exit mobile version