NTV Telugu Site icon

YS Jagan: బెంగళూరు నుంచి ఇడుపులపాయకు జగన్‌..

Jagan

Jagan

YS Jagan: మరోసారి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకున్న ఆయనకు.. వైసీపీ నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వత ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లో వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. గత కొంత కాలంగా జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య ఇంఛార్జ్‌ వివాదం కొనసాగుతోంది. ఇద్దరు నేతల మధ్య సయెధ్య చేసేందుకు ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.. దీంతో ఆ పంచాయితీ ఇప్పుడు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ వద్దకు చేరింది. ఇక, ఇరు వర్గాలను పిలిపించి సయోధ్య చేస్తున్నారు వైఎస్‌ జగన్‌.. ఇరు వర్గాలు తమ నేతకే ఇంచార్జ్‌ పదవి ఇవ్వాలని పట్టు బట్టినట్లుగా తెలుస్తోంది.

Read Also: PM Modi : ఈ సారి దీపావళి ప్రత్యేకం..500ఏళ్ల తర్వాత తన ఇంట్లో కూర్చున్న రాముడు : ప్రధాని మోదీ

మరోవైపు మాజీ సీఎం వైఎస్‌ జగన్ ముందుకు కడప నియోజకవర్గ నేతల పంచాయతీ చేరింది.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మరియు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, కడప మేయర్ సురేష్ బాబులతో సమావేశం అయ్యారు వైఎస్‌ జగన్.. కడప ఇంఛార్జ్‌ అంజాద్ భాష, మేయర్ సురేష్ బాబు మరియు కడప జిల్లా ఇన్చార్జి రవీంద్రనాథ్ రెడ్డి మధ్య కొన్నాళ్లుగా అంతర్గత విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం.. దీంతో.. ముగ్గురి మధ్య తలెత్తిన సమస్యలను జగన్‌ ముందు పెట్టారట వైసీపీ నేతలు.. మొత్తంగా ఈ పర్యటనలో పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..