Tiger Census: కడప జిల్లా సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ లోని లంకమల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. సిద్ధవటం రేంజ్ లో 64 ప్రాంతాలను గుర్తించి 128 అత్యాధునిక డిజిటల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మద్దూరు, కొండూరు, ముత్తుకూరు, పొన్నపల్లి, గొల్లపల్లె అటవీ ప్రాంతాలలో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు.. రాష్ట్రస్థాయి పులుల గణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పులులు ఘనన చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారిని కళావతి తెలిపారు. కెమెరాలలో నిక్షిప్తమైన డాటాను నాగార్జునసాగర్ లోని టైగర్ రిజర్వు విభాగం అధికారులకు పంపనట్లు ఆమె వివరించారు. ఈ సర్వే ద్వారా సిద్ధపటం అటవీ ప్రాంతంలో పులులు ఉన్నాయా లేదా అనే వివరాలు వెల్లడి కానున్నాయి.. అటవీ ప్రాంతంలోని నీటి సౌకర్యం కలిగిన ప్రాంతాలలో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు తాము కొన్ని ఫులుల పాదముద్రలను గుర్తించినట్లు ఆమె వివరించారు…
Read Also: Israel-Hamas: ఇజ్రాయెల్ దూకుడు చర్య.. గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత
కాగా, అడవులు వైఎస్సార్ కడపజిల్లా సిద్ధవటం దగ్గర పెన్నా నది వరకూ విస్తరించి ఉంటాయి. ఈ నదికి దక్షిణం అంచున- సిద్ధవటం నుంచి మొదలవుతాయి లంకమల అడవులు. సుమారు 800 చదరపు కిలోమీటర్లలో బద్వేలుదాకా విస్తరించి ఈ ఫారెస్ట్ ఉండగా.. అక్కడి నుంచి నల్లమల ప్రారంభమవుతుంది. అలా ఓ వైపు శేషాచలం అరణ్యం, మరోవైపు నల్లమల అడవులు వీటి మధ్య త్రికోణాకృతిలో ఉంటాయి లంకమల అభయారణ్యం. లంకమల అభయారణ్యం అరుదైన వణ్యప్రాణులకు నిలయంగా ఉంది..