Site icon NTV Telugu

CM Chandrababu: కార్యకర్తలే నా హై కమాండ్.. వారే సుప్రీం..

Chandrababu

Chandrababu

CM Chandrababu: కార్యకర్తలే నా హై కమాండ్.. వారే సుప్రీం అని తెలిపారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు.. కార్యకర్త నా హై కామాండ్.. కార్యకర్తె నా సుప్రీం అని స్పష్టం చేశారు.. తొలిసారిగా 65 మంది యువత కు సీట్లు ఇచ్చాం… ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని గుర్తుచేశారు.. లోకేష్ 6 శాసనాలు ప్రవేశ పెట్టారు.. ఆయనకు ఉన్న నాలెడ్జితో మంచి ఆలోచనలు చేస్తున్నారు.. టీడీపీ కొత్తతరహా పరిపాలనకు శ్రీకారం చుట్టింది.. ఎప్పటికి అప్పుడు ప్రజాఅభిప్రాయం తీసుకుంటున్నాం అన్నారు.. కార్యకర్తలే అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నాం.. కొన్ని నియోజకవర్గాల్లో ఓడినా మెజార్టీ వచ్చిందని వెల్లడించారు..

Read Also: Pawan Kalyan : ‘OG’ మూవీలో మరో హీరోయిన్..!

ఇక, గుండె పోటుతో వివేకానంద రెడ్డి మృతి చెందారు… ఆ నాడు నేనుకూడా నమ్మాను.. గొడ్డలితో నరకడం వల్ల మెదడు కూడా బయటకు వచ్చినా దాచారు అంటూ వైఎస్‌ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.. ఆ రోజు సాయంత్రానికి అనేక మలుపులు తిప్పింది ఎవరో మీకు తెలుసు… మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని రాశారని ఫైర్‌ అయ్యారు. అయితే, మన దగ్గర ఉండే కొందరు కోవర్టు రాజకీయాలు చేస్తున్నారు.. తప్పులు చేసే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.. నేరస్తులు ఖబడ్దార్.. నా వద్ద మీ ఆగడాలు సాగవు.. కోవర్టులతో రాజకీయాలు చేస్తే ఉరుకోను అని వార్నింగ్‌ ఇచ్చారు.. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు..

Exit mobile version