Site icon NTV Telugu

TDP Mahanadu 2025: లోకేష్‌కి కీలక పదవి..! మహానాడులో ప్రతిపాదన

Dhulipalla Narendra

Dhulipalla Narendra

TDP Mahanadu 2025: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌కి.. ఈ సారి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది.. ఇక, మహానాడులో ఈ రోజు కీలక పరిణామాలకు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఎందుకంటే.. ఈ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణస్వీకారం అన్ని జరిగిపోనున్నాయి.. అయితే, మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. లోకేష్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మినీ మహానాడులో తాము తీర్మానించామని.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు ధూళిపాళ్ల నరేంద్ర.. పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ కోరుకుంటున్న విధంగా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు నరేంద్ర.. కాగా, ఇప్పటికే వరకు టీడీపీలో జాతీయ అధ్యక్షడు, ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో, ఏపీ, తెలంగాణకు పార్టీ అధ్యక్షులు ఇలా కీలక పదవులు ఉన్నాయి.. అయితే, నారా లోకేష్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను చేయాలన్న డిమాండ్‌ ఉండడం.. ప్రతిపాదనలు కూడా చేయడంతో.. ఇప్పుడు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది..

Read Also: WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

కాగా, కార్యకర్తలే నా హై కమాండ్.. వారే సుప్రీం అని మహానాడులో ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇదే సమయంలో లోకేష్ 6 శాసనాలు ప్రవేశ పెట్టారు.. ఆయనకు ఉన్న నాలెడ్జితో మంచి ఆలోచనలు చేస్తున్నారు అని ప్రశంసలు కురిపించిన విషయం విదితమే.. ఇక, టీడీపీ కొత్తతరహా పరిపాలనకు శ్రీకారం చుట్టింది.. ఎప్పటికి అప్పుడు ప్రజాఅభిప్రాయం తీసుకుంటున్నాం అన్నారు.. కార్యకర్తలే అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నాం.. కొన్ని నియోజకవర్గాల్లో ఓడినా మెజార్టీ వచ్చిందని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Exit mobile version