Site icon NTV Telugu

YS Vivek Murder Case: వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు దస్తగిరి, షబానా!

Ys Viveka

Ys Viveka

YS Vivek Murder Case: వైఎస్ వివేక హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. కడప సెంట్రల్ జైలులో అప్రూవర్ దస్తగిరి, అతడి భార్య షబానాను విచారిస్తున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మూడోసారి విచారణ చేస్తున్నారు. 2023 నవంబర్ 28వ తేదీన జైల్లో దస్తగిరిని బెదిరించిన ఘటనపై దర్యాప్తు జరుగుతుంది. వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి పేరు ప్రస్తావనకు రావడం సంచలనం రేపుతుంది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్ల రూపాయలు ఇస్తామని, మాట వినకపోతే జైలు నుంచి బయటికి రాగానే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు దస్తగిరి ఆరోపణలు చేశాడు.

Read Also: Tejashwi Yadav: తేజస్వి యాదవ్ హామీల వర్షం.. జీవికా దీదీలకు రూ.30 వేలు ఇస్తామని ప్రకటన

అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కడప జైల్లో దర్యాప్తు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో వేగంగా విచారణ జరుగుతోంది. వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి, షబానా విచారణకు హాజరు పూర్తి వివరాలు అందజేసినట్లు తెలుస్తుంది. అలాగే, ఈ విచారణకు హాజరైన పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి.. దస్తగిరిని బెదిరించిన సమయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బీటెక్ రవి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. ఇక, దస్తగిరి ఫిర్యాదుతో మరోసారి వైఎస్ వివేక హత్య కేసు సంచలనం సృష్టించింది.

Exit mobile version