Site icon NTV Telugu

Nara Lokesh: సీఎం పదవిపై నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: మహానాడు వేదికగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది.. మరోవైపు, లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే అభిప్రాయం కూడా గతంలో గట్టిగానే వినిపించింది.. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిపై మంత్రి నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో నారా లోకేశ్ చిట్‍చాట్‌లో తదుపరి సీఎం మీరేగా అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? అని ప్రశ్నించారు.. సీఎం చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే అని అభివర్ణించారు.. దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు నారా లోకేష్‌..

Read Also: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ‘చరిత’.. ఆమెకు మనోజ్ థాంక్స్?

అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదు.. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయన్నారు లోకేష్.. వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెళ్తే పొగాకు రైతుల సమస్యలు తెలిశాయి. వెంటనే అధికారులను, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేశాం.. పార్టీకి నిరంతరం ఫీడ్‍బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు.. కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతరం చర్చ జరగాలి.. పార్టీ బలంగా ఉండాలి.. సంస్థాగతంగా బాగుండాలని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..

Read Also: Infiltration: బంగ్లాదేశ్‌ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..

ఇక, మహానాడులో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ.. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం చేయాలి. అందుకే ప్రతివారికి న్యాయం చేసేలా సోషల్ రీ ఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. తెలుగుజాతి విశ్వఖ్యాతి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో నెం. 1 స్థానంలో ఉండాలి. అన్నిరంగాల్లో మన తెలుగువారే ముందుండాలి. దీనినే అజెండాగా పెట్టుకొని మనం పనిచేయాలన్నారు.. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాం, పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం. మనరాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారు. అన్నిరంగాల్లో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే యువగళం లక్ష్యంగా పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version