Site icon NTV Telugu

MP YS Avinash Reddy Arrest : ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..

Mp Ys Avinash Reddy Arrest

Mp Ys Avinash Reddy Arrest

MP YS Avinash Reddy Arrest : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఉదయం 7 గంటలకే పులివెందులతో పాటు ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది.. అయితే, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.. పులివెందులలోని అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు.. దీంతో, ఆయన అరెస్ట్‌ను గ్రహించిన వైసీపీ శ్రేణులు అవినాష్‌ రెడ్డి ఇంటి వద్దే నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపిన పోలీసులు.. వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. బలవంతంగా అరెస్ట్‌ చేశారు.. ఆయన్ను ఈడ్చుకెళ్లి అరెస్ట్‌ చేసినంత పనిచేశారు..

Read Also: Asia Cup 2025: స్టార్‌ పేసర్‌ ఎంట్రీ.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!

అయితే, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. జడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని మేం కోరుతూ వస్తున్నామని.. నేను ఇంట్లో ఉండగా వచ్చి అరెస్ట్‌ చేయడం దేనికి అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం, పోలీసులు విఫలం అయ్యారని దుయ్యబట్టారు.. అరెస్ట్‌ సమయంలో పోలీసులతో అవినాష్‌ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, ఇంట్లోనే ఉంటానంటూ చెప్పినా పోలీసులు వినకుండా అరెస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సిట్టింగ్‌ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు.. అయితే, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ సందర్భంగా పులివెందులలో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి..

Exit mobile version