NTV Telugu Site icon

కడపలో తల్లీ, ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి

కడప జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లిలో దారుణం జరిగింది. బావిలో ఓ మహిళ ఇద్దరు పిల్లలు గుర్తు తెలియని మృతదేహాలు కలకలం రేపాయి. చెరువులో తేలాడుతున్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో నీటి నుండి వెలికి తీసిన రెవెన్యూ, పోలీసులు వారి గురించి ఆరా తీస్తున్నారు. ఎవరైనా చంపి బావిలో వేశారా లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తల్లి, ఇద్దరు కొడుకులు మృతికి కారణాలను అన్వేషిస్తున్నారు.