Minister ParthaSarathy: కడప జిల్లాలో జరుగుతోన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. పులివెందులలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.. గత ప్రభుత్వం పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని దీంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు… గత ప్రభుత్వం గమ్యం లేని పరిపాలన చేశారు.. రాష్ట్ర అభివృద్ధి పట్ల విజన్ కనిపించలేదు.. బటన్ నొక్కాం సంక్షేమ ఇచ్చాం పని ఐపోయింది అనుకున్నారు.. అమ్మ ఒడి, విద్యా దీవెన ఇచ్చారు వదిలేశారు.. ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు.. రైతు భరోసా ఇచ్చాం అని రైతులను మోసం చేస్తారా? అని మండిపడ్డారు.. హెచ్ఎన్ఎస్ఎస్ రాయలసీమకు జీవనాధారం.. ఎందుకు పూర్తి చేయలేకపోయారు.. సాగునీరు, వ్యవసాయ పరికరాలు రైతులకు ఇవ్వలేదు.. రైతులకూ 1600 కోట్లు ఎగ్గొట్టారు.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చెరువులు నింపలేకపోయారు.. పులివెందులలో గృహ నిర్మాణం దారుణంగా ఉంది.. కనీసం పర్యవేక్షణ చేయలేదు అంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: Hyd Traffic : రాఖీ పండుగ ఎఫెక్ట్.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్
రాయలసీమ లో స్టీల్ ప్లాంట్ ఆమోదం చేశాం.. చేనేతలకు కూటమి ప్రభుత్వం పవర్ లూమ్స్ కు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం.. నేతన్న భరోసా పేరు 25 వేలు ఇస్తున్నాం అని వెల్లడించారు మంత్రి పార్థసారథి.. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజల ఆదరణ చూస్తుంటే టీడీపీ తప్పక గెలుస్తుందనే నమ్మకం కలుగుతుందన్నారు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీకి విశేష ఆదరణ లభిస్తోంది.. టీడీపీ వల్ల నష్టం జరగలేదని ప్రజలు అంటున్నారు.. గత ప్రభుత్వం గమ్యం లేని పరిపాలన చేసిందని మండిపడ్డారు మంత్రి కొలుసు పార్థసారథి..
