Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!

  • కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానం..
  • స్వతంత్ర అభ్యర్థి శిగినేని సుబ్బమ్మ విజయం
  • జనసేన అభ్యర్థి వీరం మౌనికపై 373 ఓట్ల మెజారిటీతో గెలుపు..
Janasena

Janasena

Independent Candidate Victory: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. మెజారిటీ స్థానాల్లో అధికార కూటమి పార్టీ విజయం సాధించగా.. మరికొన్ని స్థానాల్లో ముందజంలో ఉంది. మరోవైపు వైస్సార్సీపీ పార్టీ కొన్ని స్థానాలకే పరిమితమైంది. ఇకపోతే కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానంలో పరిస్థితి విభిన్నంగా ఉంది. అక్కడ పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి శిగినేని సుబ్బమ్మ ఘన విజయం సాధించారు. జనసేన అభ్యర్థి వీరం మౌనికపై 373 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంతో తాళ్లమాపురంలో సుబ్బమ్మ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

తాళ్లమాపురంలో మొత్తం 3,709 ఓట్లు ఉండగా.. 2,976 ఓట్లు పోలయ్యాయి. కాగా, గతంలో ప్రొద్దుటూరులో జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాళ్లమాపురం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అయితే కూటమి అభ్యర్థుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ అనూహ్య ఫలితానికి కారణమయ్యాయనే చర్చ స్థానికంగా జరుగుతోంది.