Site icon NTV Telugu

Gandikota Murder Case: మిస్టరీగానే గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. ఎస్పీ ఏం చెప్పారంటే..?

Kadapa

Kadapa

Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా ఉంది. ఈ సందర్భంగా రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుంది అన్నారు. సెల్ టవర్ ఆధారంగా 350 మంది అనుమానితుల ముబైల్ సిగ్నల్స్ గుర్తించాం.. అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక జాతర జరిగింది.. రెండు సెల్ టవర్ల సిగ్నల్స్ ఒకే ప్రాంతంలో ఉండడంతో విచారణ చేయడం ఆలస్యం అవుతోంది.. మిగిలిన 60 మందిని విచారించాల్సి ఉంది.. విచారణలో వేగం పెంచామని ఆయన పేర్కొన్నారు. ఇక, గండికోట ప్రాంతంలో మైనర్ పిల్లలకు గదులు ఇవ్వొద్దని స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది.. కుటుంబ సభ్యుల పైనా ఆరోపణలు రావడం నిజమే వాటిని కూడా పరిశీలిస్తున్నామని డీఐజీ ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

Read Also: Finance Scam: ఫైనాన్స్ ముసుగులో దారుణాలు.. వెలుగులోకి తండ్రీకొడుకుల బాగోతం..!

అయితే, మైనర్ బాలిక వైష్ణవీ హత్య కేసు దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేమని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఈ కేసును వీలైనంత తొందరగా చేధిస్తామన్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యం లేనందున విచారణ ఆలస్యం అవుతోందన్నారు. కుటుంబ సభ్యుల ప్రమేయంపై సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ చేస్తాం.. పోలీసులకు ఎలాంటి దివ్య శక్తులు లేవు.. మానవ శక్తిపై ఆధారపడి విచారణ కొనసాగిస్తున్నామని డీఐజీ ప్రవీణ్ చెప్పారు.

Exit mobile version