NTV Telugu Site icon

Chandrababu: రేపు మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ ప్రారంభించనున్న చంద్రబాబు

Chandrababu

Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మైదుకూరులో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్నారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతిని కూడా మైదుకూరులోనే సీఎం చంద్రబాబు నిర్వహించనున్నారు.

చంద్రబాబు షెడ్యూల్ ఇదే..
శనివారం ఉదయం 10:30కి ఉండవల్లి నివాసం నుంచి ఉ.11:05 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఉ.11:50 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు కడప విమానాశ్రయం నుంచి మ. 12:10 నిమిషాలకు మైదుకూరులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. మ. 12 గంటల 20 నిమిషాలకు కేఎస్సీ కళ్యాణ మండపానికి చేరుకుని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మ. 1:50 నిమిషాలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. కేఎస్సీ కళ్యాణ మండపం నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వినాయక నగర్‌లోని మున్సిపల్ కార్మికుని ఇంటిని సందర్శించి చెత్త సేకరణ గురించి వివరిస్తారు. మ. 2:15 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి నేషనల్ గ్రీన్ కాప్స్‌తో కలిసి నడుస్తూ రాయల కూడలి ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభిస్తారు. సాయంత్రం 4: 30 నిమిషాలకు హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకుని 4:40 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4: 50 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి సా.5:35లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అమరావతిలోని నివాస గృహానికి 6 గంటల 15 నిమిషాలకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు.

ఇది కూడా చదవండి: Loan on Aadhaar Card: అర్జెంటుగా డబ్బులు కావాలా?.. ఆధార్ కార్డుతో ఐదు లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్!