NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: గత ఏడాది దేశంలోనే ఏపీకి అత్యధిక పెట్టుబడులు..

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్‌కి గత ఏడాది దేశంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కడప ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ కర్నూల్, అనంతపురం, కడప శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి.. మా అభ్యర్దులు శాసనసభ్యులతో కలసి మమేకమై విజయం దిశగా అడుగులు వేసేందుకు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగులకు, పట్టభద్రులకు అనేక మంచి పనులు చేశారని ప్రశంసలు కురిపించారు.. ఇదే సమయంలో.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదు అని ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. గత ఏడాది దేశంలోనే ఏపీకి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు..

Read Also: Hong Kong: హాంకాంగ్ మోడల్ దారుణ హత్య.. ఫ్రిజ్ లో కాళ్లు.. ఇంకా దొరకని తల

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తున్నారని తెలిపారు.. అందుకే ఏ ఎన్నికలు జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారని వెల్లడించారు. అయితే, ప్రభుత్వ పథకాలను తప్పుపట్టే అవకాశం లేకపోవడంతో.. ప్రభుత్వంపై, సీఎం వైఎస్‌ జగన్‌పై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. దేశంలోనే తొలిసారిగా వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. బీసీలను ఓటు బ్యాంకులా చూసి అవమానించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డ విషయం విదితమే.