AP High Court: కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది.. మాజీ మేయర్ సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మేయర్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 4న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ మేయర్ సురేష్ బాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు.. సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ అలాగే అమల్లోకి రావడంతో, మేయర్ ఎన్నికలు నిర్ణీత తేదీకి నిర్వహించేందుకు అడ్డంకులు తొలగిపోయినట్టు అయ్యింది..
Read Also: Akhanda 2 Thandavam: కలిసొచ్చిన ఆలస్యం . . రికార్డు అడ్వాన్స్ బుకింగ్స్!
కాగా, ఇటీవలే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగించిన ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది..ఇక ఆ తర్వాత ఈ మధ్యే కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 11వ తేదీన అంటే రేపు ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు అందరూ కూడా ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే..
