Site icon NTV Telugu

Janasena MLA Arava Sridhar video leak: జనసేన ఎమ్మెల్యే మరో వీడియో లీక్‌.. ఏకంగా అసెంబ్లీ హాల్‌లో నుంచే వీడియో..

Janasena Mla Arava Sridhar

Janasena Mla Arava Sridhar

Janasena MLA Arava Sridhar video leak: రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారంలో తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈసారి లీక్ అయిన వీడియోలో ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మహిళతో వీడియో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: BJP: కాంగ్రెస్ ‘‘ఆధునిక ముస్లిం లీగ్’’.. అన్సారీ ‘‘గజినీ’’ కామెంట్స్‌పై బీజేపీ..

అసెంబ్లీ హాల్‌లో చర్చలు కొనసాగుతుండగానే ఎమ్మెల్యే శ్రీధర్ తన మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న దృశ్యాలు బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభ వేదికలో ఇటువంటి ప్రవర్తన ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనతో ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న జనసేన ఎమ్మెల్యే వ్యవహారం మరింత ముదిరింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడగా, తాజాగా అసెంబ్లీ హాల్‌కు సంబంధించిన వీడియో లీక్ కావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

మొత్తానికి, రోజుకో వీడియో బయటపడుతూ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించిన ఘటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే.. సదరు మహిళకు వీడియో కాల్‌ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్.. మరోవైపు చాటింగ్‌ కూడా చేస్తున్నట్టు ఉన్న ఆ వీడియో తీవ్ర చర్చకు దారితీసింది..

Exit mobile version