Anchor Shyamala: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.. పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. పులివెందులలోని మెడికల్ కాలేజీని సందర్శించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేశారో అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయేందుకే నా పయనం అన్నారు.. మొదటిరోజు కావడంతో వేంపల్లిలోని గండి ఆంజనేయస్వామిని దర్శించి పులివెందులలోని మెడికల్ కాలేజీ ప్రాంతాన్ని పరిశీలించాం… ప్రజలకు వైద్యం, విద్య అందుబాటులో ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మెడికల్ కాలేజ్ నిర్మించారని తెలిపారు.. వందలాది కోట్ల ఖర్చుపెట్టి బిల్డింగులు నిర్మిస్తే దేనికి పనికిరాకుండా చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. గత వైసీపీ ప్రభుత్వం 100 మెడికల్ సీట్లు అడిగితే కేంద్ర ప్రభుత్వం 50 సీట్లు మంజూరు చేసింది… కానీ, మంజూరు చేసిన 50 మెడికల్ సీట్లను కూడా కూటమి ప్రభుత్వం వెనక్కి పంపిందంటూ మండిపడ్డారు.. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆగిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల..
Read Also: JC Prabhakar Reddy: ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయ సమాధే..! జగన్‌కు జేసీ కీలక సూచనలు
