Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో పోటీపై.. పొత్తులపై ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేక టీడీపీ, జనసేన మైత్రితో ముందుకు వెళ్తాయా? లెఫ్ట్ పార్టీలు ఎటువైపు.. అనే చర్చ సాగుతోంది.. అయితే, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. మరోసారి సింగిల్‌గానే బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. సింహం సింగిల్ గానే వస్తుంది.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న ఎన్నికల్టో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. మరోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Naga Chaitanya: ‘కస్టడీ’ నుంచి బయటపడ్డ నాగచైతన్య..
ఇక, ఏపీలో శాంతి భద్రతల పేరిట టీడీపీ నానా రాద్దాంతం చేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు మంత్రి సురేష్.. ప్రజలను మీడియాను అడ్డుపెట్టుకుని మభ్యపెట్టాలని తెలుగుదేశం పార్టీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు.. మరోవైపు.. గతంలో టీడీపీ.. ఎంపీ సీట్లను అమ్ముకునే వారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కల్లబొల్లి మాటలతో ఇప్పటికీ టీడీపీ మభ్యపెట్టాలని చూస్తోంది.. ప్రభుత్వం సామాజిక సాధికారత దిశగా అడుగులు ముందుకు వేస్తోందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. కాగా, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం స్థానాల్లో విజయం టార్గెట్‌గా పెట్టుకుంది వైసీపీ.. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తోన్న సీఎం జగన్.. అంతా కలిసి విజయం కోసం పనిచేయాలని పిలుపునిస్తున్న విషయం విదితమే.