Site icon NTV Telugu

23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి.. రేపే రూ.4,339.39 కోట్లు జమ

CM Jagan

CM Jagan

ఓవైపు కరోనా మహమ్మారి విజృంభణతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినా.. మరోవైపు.. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వరుసగా అన్ని సంక్షేమ పథకాలను రెండో ఏడాది కూడా అమలు చేస్తూనే ఉంది.. ఇక, కొన్ని పథకాలైతే.. మరింత ముందుగానే అందిస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇందులో భాగంగా రేపు వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత అందించనున్నారు ఏపీ సీఎం.. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో మహిళల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.. మహిళలకు ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వైఎస్సార్‌ చేయూత తీసుకొచ్చింది వైసీపీ సర్కార్… నాలుగేళ్లలో దాదాపు రూ. 19,000 కోట్లు ఈ పథకం కింది అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఈ పథకం కింది ఈ ఏడాది 23,14,342 మంది మహిళలలు లబ్ధిపొందనున్నారు.. రేపు 4,339.39 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

Exit mobile version