YS Vijayamma: వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ ఈ మేరకు వైఎస్‌ఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాదేస్తుందన్నారు. రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లం.. కానీ, నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదు.. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్ని నా కళ్ళముందే జరిగి పోతున్నాయి.. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని వైఎస్ విజయమ్మ వాపోయారు.
Read Also: Population Census: జనాభా గణనలో అడిగే 30 ప్రశ్నలు ఇవే..
ఇక, మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను అని వైఎస్ విజయమ్మ కోరారు. దయచేసి ఈ కుటుంబం గురించి.. నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు.. అనవసర దూషణలు చేయొద్దని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు అని కోరారు. వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెల్లు.. ఇది వాళ్ళిద్దరి సమస్య.. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారని వైఎస్ విజయమ్మ వెల్లడించారు.
Read Also: Triumph: ఇండియాలో 2025 ట్రయంఫ్ టైగర్ 1200 రిలీజ్.. ధర, ఫీచర్లు ఇవే
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు.. ఇంతటి వివాదం జరిగేది కాదు.. ఈ ఆస్తుల విషయంపై నేనూ ఇలా బహిరంగ లేఖ రావాల్సిన అవసరం పడేది కాదు అని తెలిపారు. అయినా దీనిపై జరుగుతున్న రచ్చను చూసి.. నా మాటలు మాత్రమే ఆపుతాయనీ విశ్వసిస్తున్నాను.. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది.. మరొక్కసారి మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరినీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి కోరారు.