Site icon NTV Telugu

YS Jagan: వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం..

Jagan

Jagan

YS Jagan: తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీకి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే, బూత్ లెవల్‌లో పార్టీ కేడార్‌ను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.

Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. వరుసగా రెండోరోజు భారీగా పెరిగిన బంగారం ధర!

అలాగే, త్వరలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడీ అయ్యారు. ఇప్పటికే మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన వైసీపీ.. రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల కూడా ఇన్‌ఛార్జ్‌ల నియమించేందుకు ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక, పార్టీ భవిష్యత్ కార్యాచణపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేలా వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version