ఇల్లులేని పేదలకోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో సుమారు 15 లక్షలకు పైగా గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పథకం ద్వారా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులను కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ జగనన్న కాలనీల నిర్మాణం పనులను సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన గృహనిర్మాణ పనులను పూర్తిచేస్తామని, రాష్ట్రజనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇంటిని ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రూ.32,900 కోట్లకు పైచిలుకు నిధులతో జగనన్న కాలనీలను నిర్మిస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రూ.5 నుంచి రూ.15 లక్షల విలువచేసే ఆస్తిని ఇస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఇంటిని కట్టుకోలేని పేదవారికి ప్రభుత్వమే నేరుగా నిర్మించి ఇస్తుందని అన్నారు. లబ్దిదారుల జాబితాలో పేర్లులేని వారు గ్రామ సచివాలయాల్లో ధరఖాస్తు చేసుకోవాలని వైఎస్ జగన్ తెలిపారు.
ప్రతి నలుగురిలో ఒకరికి సొంతిల్లు…
