Sailajanath Joins YSRCP: మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నేత సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైసీపీలో చేరానని తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని అన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి సర్కార్ నెరవేర్చటం లేదని ఆరోపించారు. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రాయలసీమలోని ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, వైసీపీ నేత శైలజానాథ్ పేర్కొన్నారు.
Read Also: Vijayasai Reddy: ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే పదవుల్ని వదులుకున్నా..
ఇక, రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్థిక ప్రయోజనాల కోసం కాదని వైసీపీ నేత శైలజానాథ్ అన్నారు. కాంగ్రెస్ నుంచి మరి కొందరు నేతలు వచ్చే అవకాశం ఉందని.. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా నా శక్తి మేరకు పని చేస్తాను అని మాజీ మంత్రి శైలజానాథ్ చెప్పారు.