మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కడప జిల్లా సెంట్రల్ జైలు దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీగా అనుచరులు రావడంతో జైలు వద్ద తోపులాట జరిగింది. భాస్కర్ రెడ్డి కారు క్రింద ఒక కానిస్టేబుల్ పడిపోయారు. అయితే, వెంటనే అలెర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.సీబీఐ విచారణ సమయం పదింటికి కచ్చితంగా హాజరయ్యారు. భాస్కర్ రెడ్డి వెంట ఆయనలాయర్ కొండారెడ్డి కూడా ఉన్నారు. అయితే సీబీఐ అధికారులు అందుబాటులో లేకపోవడంతో భాస్కర్ రెడ్డి వెళ్లిపోయారు.
Also Read:MLC Eelections: ఏపీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ
అయితే, ఈ కేసుకు సంబంధించిన భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంపై స్పందించిన భాస్కర్ రెడ్డి.. తనను అరెస్టు చేస్తే చేసుకోండి అని అన్నారు. తాను అన్నింటికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సిబిఐ విచారణ కోసం ఈరోజు తనను పిలిచారని తెలిపారు. ఆరోగ్యం సహకరించలేకపోయినా విచారణ కోసం వచ్చానని తెలిపారు. ఈ కేసు పరిష్కారం కావాలంటే లెటర్ గురించి తెలుసుకోవాలి… అ లెటర్ గురించి తెలిస్తేనే అసలు విషయం బయటకు వస్తుందని చెప్పారు. వివేకా ఇంట్లో లభ్యమైన లేఖను పరిశీలించాలని ఆయన కోరారు. ఎన్ని దర్యాప్తు సంస్థలు ఈ కేసును విచారించినా పరిష్కారం కావాలంటే ఆ లేఖ ఆధారంగా దర్యాప్తు చేయాలన్నారు. లెటర్ లేకుండా ఏ దర్యాప్తు సంస్దకూడా కేసును పూర్తి చెయలేదన్నారు. విచారణ ఎప్పుడనేది మళ్లీ చెప్తామని సీబీఐ అధికారులు చెప్పారని తెలిపారు. మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతానని భాస్కర్ రెడ్డి చెప్పారు.