దాచేపల్లి, గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసింద న్నారు. నామినేషన్లు అడ్డుకొని పరిశీలనలో తొలగించడం, అభ్యర్థు లను కిడ్నాప్ చేయాలని చూడటం, పోలింగ్ బూత్‌లను ఆక్రమించు కోవాలని చూడటం ఇవన్నీ ఏంటని ఆయన ప్రశ్నించారు. జంగ మహేశ్వరపురంలో నామినేషన్స్ వేయకుండా అడ్డుకున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలానే ఉపయోగిం చారంటూ యరపతినేని వైసీపీపై మండిపడ్డారు.
ఓటర్లకు రక్షణ కల్పించమని కోర్టు ఆదేశించినప్పటికీ, కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. వైసీపీకి సహకరించిన పోలీస్ అధికారులపై కోర్టుకు వెళ్తామన్నారు.టీడీపీ మాజీ సర్పంచ్ తంగెళ్ళ శ్రీనివాస రావుపై వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి భర్త మునగా పున్నారావు అకారణంగా దాడి చేశారని, ఇది హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బరి తెగించారన్నారు.టీడీపీ అసలు పోటీలోనే ఉండకూడదని వైసీపీ నేతలు అనుకుంటున్నారన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఈ ఎన్నికల్లో ధైర్యంగా పోరాడారని, వైసీపీ వారు గెలిచే దమ్ము లేనందునే దౌర్జన్యాలకు పాల్పడ్డారని యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు.