Site icon NTV Telugu

VijayaSaiReddy: కౌంట్ డౌన్ స్టార్ట్.. మహాపరాజయానికి ముందే చాప్టర్ క్లోజ్

Vijayasai Reddy

Vijayasai Reddy

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. తాజాగా టీడీపీపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘పచ్చకుల పార్టీ ‘కౌంట్ డౌన్’ మొదలైంది. 2024 ఎన్నికల మహా పరాజయానికి ముందే చాప్టర్ క్లోజ్. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు కార్యకర్తలను రెచ్చగొట్టి కేసుల్లో ఇరికిస్తున్నాడు దొంగ బాబు. తుప్పు, పప్పులను తరిమికొట్టి, జెండా మోసినోళ్లంతా ఏకమై టీడీపీని బతికించుకోండి’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరోవైపు ‘శిశుపాలుడి పాపాలు వెంటాడుతుంటే ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి బొంద పెట్టిన ముసలి నక్క. సభ్యత, సంస్కారాలు అన్నీ గాలి కొదిలి రికార్డింగ్ డ్యాన్సుల్లో అటు-ఇటు కాని కమెడియన్ టైపు గంజాయి పాత్రుడు డిస్కోని ఉస్కో అంటున్నాడు. ఎవరు మొరిగినా బొక్క తుప్పు నాయుడుకే’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Exit mobile version