ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా యువతను ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైందని, అందుకే యువత అందరూ ఓటు వేయడం మన కర్తవ్యంగా పరిగణించాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ఎందుకంటే మన దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందేనని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
కాగా ప్రతి ఏడాది జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం 12వ నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తోంది. 1950న భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి జరుపుకుంటున్నారు.