ఏపీలో తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు పదవులను బీసీలకు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభ పదవులు కట్టబెట్టడం అభినందనీయమన్నారు.
Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన సర్కార్..
బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే పదవులను సీఎం జగన్ సామాన్య బీసీలకు కట్టబెట్టడం అందరిని ఆశ్చర్యపరిచిందని వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ఈ విషయం చంద్రబాబు ఊహకు సైతం అంది ఉండదన్నారు. చంద్రబాబు ఎప్పుడూ బడా పారిశ్రామిక వేత్తలకే రాజ్యసభ సభ పదవులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. మరోవైపు బుధవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. 17 మంది మంత్రులు పాల్గొనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధుల బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
