Site icon NTV Telugu

ఆఫ్ఘనిస్తాన్ పై ముగిసిన అఖిలపక్ష సమావేశం…

ycp-mp-mithun-reddy

ycp-mp-mithun-reddy

ఆఫ్ఘనిస్తాన్ పై అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ… ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావాలని కోరాం. ఆఫ్ఘనిస్థాన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైంది. తాలిబన్లతో చర్చలు జరిపి అందరిని క్షేమంగా తీసుకురావాలి అని పేర్కొన్నట్లు తెలిపారు. మన దేశం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి. భారతీయులను, పెట్టుబడులను కూడా పరిరక్షించాలి. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వ్యూహాలను రూపొందించాలి. అఖిల పక్ష నేతల సూచనలను, అభిప్రాయాలను విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి జయశంకర్ రాసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని మంత్రి జయశంకర్ చెప్పారు ఆయన పేర్కొన్నారు.

Exit mobile version