NTV Telugu Site icon

ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు త‌ప్ప‌దు..!

MP Margani Bharat

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌డం ఖాయ‌మంటున్నారు వైసీపీ చీప్ విప్ మార్గాని భ‌ర‌త్.. ఇవాళ ఢిల్లీలో లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాను క‌లిసిన ఆయ‌న‌.. రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాల‌ని.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్నిఅతిక్రమించిన రఘురామను కృష్ణరాజును వెంటనే డిస్‌క్వాలిఫై చేయాల్సిందిగా మరోసారి విజ్ఞ‌ప్తి చేశారు.. ఈ సంద‌ర్భంగా ఎన్టీవీతో ప్ర‌త్యేకంగా మాట్లాడిన ఆయ‌న‌.. రఘురామ కృష్ణ రాజుపై అనర్హత వేటు పడుతుందన్న విశ్వాసంతో ఉన్నామ‌ని తెలిపారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని ఇవాళ స్పీకర్ ను కలసి లేఖ ఇచ్చాం.. ఆయ‌న‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. వైసీపీ ఎంపీగా గెలిచి టీడీపీ ఎజెండాను ముందుకు తీసుకునిపోతున్నార‌ని మండిప‌డ్డారు.. ఈ విష‌యంపై గతంలో కూడా స్పీకర్ కు లేఖ ఇచ్చాం… ఇప్పడు కూడా మళ్లీ ఇచ్చామ‌న్న ఆయ‌న‌.. ఈసారి అనర్హత వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌ని విశ్వాసంతో ఉన్న‌ట్టు తెలిపారు.