MP Gorantla Madhav: మార్ఫింగ్ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఫేక్ వీడియోపై టీడీపీ ఫోరెన్సిక్ నివేదిక హాస్యాస్పదమన్నారు. ఓటుకు నోటు కేసుపై అమెరికా ఫోరోన్సిక్ నిపుణులతో టీడీపీ ఎందుకు పరీక్షలు చేయించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు వాయిస్‌పై టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదన్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురం బయల్దేరిన ఎంపీ మాధవ్‌కు.. కురువ సంఘం నాయకులు కర్నూలు సరిహద్దు టోల్‌గేట్ వద్ద స్వాగతం పలికారు.
CPI Narayana: బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం
తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు.. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాయని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. దుష్టచతుష్టయం దుష్ట ఆలోచనే ఫేక్ వీడియో వ్యవహారమని ఆయన మండిపడ్డారు. వీడియో నిజమైనదా? కాదా? అని తేల్చేందుకు పోలీసు వ్యవస్థ ఉందన్న ఆయన.. ఆ పనిని పోలీసులకు వదిలేయాలని చెప్పుకొచ్చారు. ఒరిజినల్ వీడియో కాదని పోలీసులే తేల్చారన్నారు. తనపై ఈ ప్రచారం కొనసాగిస్తే పాత మాధవ్‌ను చూస్తారంటూ ఆయన శైలిలో హెచ్చరించారు.
