Site icon NTV Telugu

సీఎం జగన్‌ పై యనమల ఫైర్‌.. తల్లి-చెల్లికి ఏం గౌరవం ఇస్తున్నారు..?

వైసీపీ సర్కార్‌ పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల ఫైర్‌ అయ్యారు. అధికారం పోతుందనే భయం వైసీపీలో మొదలైందని… ఆ భయంతోనే అసెంబ్లీలో వైసీపీ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా చేయడమే వైసీపీ ఉద్దేశమన్నారు. రంగా, మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ అంశాలు ఈనాటివా..? ఆ అంశాలకు.. సభలో జరిగిన ఘటనలకు ఏమమన్నా సంబంధం ఉందా..? అని ఫైర్‌ అయ్యారు. తన గురించి పోరాడిన తల్లి-చెల్లికి జగన్‌ ఏం గౌరవం ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు.

షర్మిలకు వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని… తల్లి-చెల్లిని కూడా జగన్‌ మోసం చేశారని చెప్పడమే తమ ఉద్దేశ్యమన్నారు. వివేకా హత్య కేసు గురించి అడిగే హక్కు ప్రతిపక్షంగా మాకుందన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని అవమానించాలనే వైసీపీ ప్రీ-ప్లాన్డుగా మాధవరెడ్డి పేరును సభలో ప్రస్తావించిందని పేర్కొన్నారు. సందర్భానుసారంగా ప్రస్తావించుంటే ఏదో ఒక్కరు అంటారు తప్ప.. ముగ్గురు అదే పనిగా మాధవరెడ్డి ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏముంది..? అని నిలదీశారు యనమల. వివేకా హత్య వెనుక ఎవరున్నారో కచ్చితంగా అడుగుతామని హెచ్చరించారు.

Exit mobile version