కరోనా వ్యథలు అన్నీ ఇన్ని కాకుండా పోయాయి.. కరోనా బారినపడిన ఆస్పత్రులకు వెళ్తే.. తిరిగి వస్తారా? అని గ్యారేంటి లేని పరిస్థితి.. ఇక, విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. కేజీహెచ్ సి ఎస్ ఆర్ బ్లాక్ వద్ద కరోనా పేషెంట్లు, బంధువులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు వచ్చాయి.. గంటల తరబడి బెడ్స్ కోసం వేచివుంటున్నా వైనం ఎక్కడచూసినా కనిపిస్తోంది.. బెడ్స్ లేక ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా రోగులు… కరోనా పేషెంట్లకు సరిగ్గా వైద్యం అందించడం లేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.. ఇక, కరోనా మృతదేహాలను పీపీ కిట్స్ లేకుండానే తరలించాల్సిన పరిస్థితులు వచ్చాయి.. ఎక్కడ కరోనా వస్తుందో అని భయంతో వణికిపోతున్నారు మృతుల బంధువులు..
విశాఖ కోవిడ్ ఆస్పత్రుల్లో కన్నీటి వ్యథలు..!
COVID 19 Vizag